ముందుగా మా ఉరి పేరు విరవ ,పిఠాపురం మండలం ,తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మా ఉరికి మాకు చేతనైనంత సేవచేద్దాం అనే ఉద్దేశ్యం తోనే యువభారత్ యూత్ స్టార్ట్ చేసాం. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా గ్రామాలూ అభివృద్ధి చెందాలి అది మా గ్రామం నుంచే స్టార్ట్ చేసాం. యూత్ లో ఉన్న సభ్యులలో ఎక్కువ మంది ఇంటర్ , డిగ్రీ చదువుతున్న వాళ్ళే ,మాకు ఏప్పుడు విలుపడుతుందో అప్పుడే ఏదో ఒక మంచి పని చేద్దాం అని స్టార్ట్ చేసాం.
ఈ యువభారత్ యూత్ కి ప్రత్యేకంగా నాయకులు అంటూ ఏవరు లేరు , ఏవరైతే ఉరికి సేవచేద్దాం అనుకుంటారో వారే యువభారత్ యూత్ కి నాయకులు. యువభారత్ యూత్ ద్వారా ఇప్పడివరకూ చేసిన కార్యకమాలు వరుసగా ఉచిత హోమియో శిబిరము ఏర్పాటు చేసి స్వైన్ ప్లూవ్ మందులను పంపిణి చేసాము. గ్రామం లో" శుబ్రత - ఆరోగ్యం" కొరకు మంచినీటి బావుల దగ్గర శుబ్రం చేసి బావిలో బ్లిసింగ్ కలపడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ బావిలో కూడా బ్లిసింగ్ ను కలపడం కొరకు వర్షం లో తడిచి మరీ యూత్ సబ్యులు ఆ కార్యక్రం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ యువభారత్ యూత్ ద్వారా ఓల్డ్ బుక్స్ సేకరించి సుమారుగా 21 మందికి ఇవ్వడం జరిగింది. ఆగష్టు 15th(15-8-2011) కి 10th క్లాసు లో 1st & 2nd వచ్చిన వాళ్ళకి గ్రామా సర్పంచ్ మరియు స్కూల్ HM గారి చేతులమిదాగా ప్రైజ్ లు ఇవ్వడం జరిగింది.
మేము చేయబోయే కార్యక్రమలో కొన్ని చెప్తాను..మధ్యలో చదువు ఆపివేసిన వాళ్ళకు రాత్రి పూట వారికీ చదువు చెప్పడం. వారి ఇంటర్స్ట్ బట్టి వారిని 10th క్లాసు ఎగ్జామ్స్ కి సిద్దం చేయడం. వర్షాకాలం లో కనీసం ఉరు మొత్తం మీద 200 మొక్కలను నాటడం, 10th క్లాసు వాళ్లకు Higher Education Awareness క్లాసు లు ఏర్పాటు చేయడం. పరిమితలుకు లోబడి ప్రభుత్వ పధకాలను సక్రమంగా అమలు జరిగేటట్టు చూడటం. విద్యార్దులకు ప్రతేకంగా గ్రంధాలయం ఏర్పాటు చేయడం. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేసి ఇంటర్ పూర్తీ చేసినవారికి కంప్యూటర్ నందు శిక్షణ ఇచ్చుట. ఇవేకాకుండా మీరు ఇచ్చేసలహాలను అమలుచేయడం కూడా జరుగుతుంది. మేము చేయబోయే కార్యక్రమాలు అన్ని వెంటనే జరగవనే విషయం మాకు తెలుసు వాటికి టైం పడుతుంది కాని వాటిని చేసితిరుతాం.
మీకు మా ఉరికి సేవచేయాలని అనిపిస్తే మీరు మతోకలిసిరండి. మీరు యువభారత్ యూత్ లో చేరడం వాళ్ళ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వృదా చేయనవరం లేదు . మీకు విలుపడినప్పుడు మాత్రమే మేమో చేసే కార్యక్రమం లో పాల్గొనండి.
contact: rajachandra.a@gmail.com Call : 09283 786 733
------------------------------------------------------------------------------------Donators List:
| S.No | Name | Amount |
| 1 | Dinesh Dora | Rs.500/- |
| 2 | Mohan Dora | Rs.500/- |
Thank you for visit our blog. We will come back soon with new updates.